Tuesday, 26 June 2012

శ్రీ రుద్రం 5వ అనువాకం

శ్రీ రుద్రం 5వ అనువాకం

నమో’ భవాయ’ చ రుద్రాయ’ చ 
ప్రాణులయుత్పత్తికి మూలకారణమైనవాడు, రుద్రునకు నమస్కారము.

నమః’ శర్వాయ’ చ పశుపత’యే చ 
పాపనాశకునకు,  పశుపతికి (అనగా: ఆజ్ఞానపు పాశములచే బంధింపబడిన జీవుల రక్షకునకు) నమస్కారము.

నమో నీల’గ్రీవాయ చ శితికణ్ఠా’య చ 
కాలకూటవిష భక్షణముచే నీలమైన కంఠభాగము కలవాడును, మిగిలిన కంఠప్రదేశమున స్వేతవర్ణము కలవాడును అగు శివునకు నమస్కారము.

నమః’ కపర్ధినే’ చ వ్యు’ప్తకేశాయ చ 
జటాజూటము కలవానికి, ముండిత కేశునకు (జుత్తు లేనివానికి) నమస్కారము.

నమః’ సహస్రాక్షాయ’ చ శతధ’న్వనే చ 
అసంఖ్యాకములైన కన్నులు కలవాడును, వందలకొద్దీ ధనస్సులు కలవాడును అగు శివునకు నమస్కారము.

నమో’ గిరిశాయ’ చ శిపివిష్టాయ’ చ 
కైలాసముననుండువాడును,  విష్ణువును తన హృదయమున ధరించువాడును అగు శివునకు నమస్కారము.

నమో’ మీఢుష్ట’మాయ చేషు’మతే చ 
అనుగ్రహమును వర్షించువాడును, బాణములను ధరించినవాడును అగు శివునకు నమస్కారము.

నమో” హ్రస్వాయ’ చ వామనాయ’ చ 
అల్ప ప్రమాణుడగుటచే హ్రస్వముగానున్నట్టి, సంకోచించిన అవయవములను కలిగియుండుటవలన వామనుడిగానున్నట్టి శివునకు నమస్కారము.

నమో’ బృహతే చ వర్షీ’యసే చ 
ఆకారముచే ప్రౌఢుడైనట్టియును, గుణములచే సమృద్ధుడైనట్టి శివునకు నమస్కారము.

నమో’ వృద్ధాయ’ చ సంవృధ్వ’నే చ 
అందరికంటే వృద్ధుడును, వేదములచే స్తుతింపబడువాడును అగు శివునకునమస్కారము.

నమో అగ్రి’యాయ చ ప్రథమాయ’ చ 
జగదుత్పత్తికి పూర్వమునుండీ ఉన్నట్టి, అందరిలో ముఖ్యుడును అగు శివునకు నమస్కారము.

నమ’ ఆశవే’ చాజిరాయ’ చ 
అంతటనూ వ్యాపించినట్టియు, గమన కుశలుడైనట్టి శివునకు నమస్కారము.

నమః శీఘ్రి’యాయ చ శీభ్యా’య చ 
శ్రీఘ్రముగాబోవువాడునూ, నీటి ప్రవాహమున ఉన్నట్టి శివునకు నమస్కారము.

నమ’ ఊర్మ్యా’య చావస్వన్యా’య చ 
ప్రవాహ తరంగములందు (కెరటములందు) ఉన్నట్టియు, ధ్వనిరహితమైన స్థిరజలములందు ఉన్నట్టియును శివునకు నమస్కారము.

నమః’ స్త్రోతస్యా’య చ ద్వీప్యా’య చ 
ప్రవాహముననున్నట్టియును, జల మధ్యస్థములైన ద్వీపములందున్నట్టి శివునకు నమస్కారము.

No comments:

Post a Comment