శ్రీ రుద్రం 7వ అనువాకం
నమో’ దుందుభ్యా’య చాహనన్యా’య చ
భేరీనందు, భేరీని మ్రోగించుటకు ఉపయోగించు దండమునందు కలవానికి నమస్కారము.
నమో’ ధృష్ణవే’ చ ప్రమృశాయ’ చ
యుద్ధమునందు ఎన్నడూ వెనుతిరగినివానికి, పర సైన్యముయొక్క రహస్యములను తెలుసుకొను గూఢచారికి నమస్కారము.
నమో’ దూతాయ’ చ ప్రహి’తాయ చ
తన స్వామికి వృత్తాంతములను తెలియజేయుటలో కుశలుడైనవానికి, తన స్వామినుండి వర్తమానములను గొనిపోవువానికి నమస్కారము.
నమో’ నిషఙ్గిణే’ చేషుధిమతే’ చ
ఖడ్గమును ధరించినవానికి, బాణములకు ఆధారమైన అమ్ములపొదిని ధరించినవానికి నమస్కారము.
నమ’స్-తీక్ష్ణేష’వే చాయుధినే’ చ
వాడియైన బాణములు కలవాడు, వివిధమైన ఆయుధములు కలవానికి నమస్కారము.
నమః’ స్వాయుధాయ’ చ సుధన్వ’నే చ
శోభనమైన ఆయుధము కలవానికి, శోభనమైన ధనస్సు కలవానికి నమస్కారము.
నమః స్రుత్యా’య చ పథ్యా’య చ
పాదసంచారమునకు మాత్రమే యోగ్యమైన ఇరుకైన మార్గమున పోవువానికి, రధాశ్వాది సంచార యోగ్యమైన విశాల మార్గమున పోవువానికి నమస్కారము.
నమః’ కాట్యా’య చ నీప్యా’య చ
అల్పమైన జలప్రవాహముల రూపమున ఉన్నవానికి, పర్వతాగ్రములనుండి అధోముఖముగా పడి ప్రవహించుచున్న జలరూపమున ఉన్నవానికి నమస్కారము.
నమః సూద్యా’య చ సరస్యా’య చ
బురదనేలలో జలరూపమున ఉన్నట్టివానికి, సరస్సున జలరూపమున ఉన్నట్టివానికి నమస్కారము.
నమో’ నాద్యాయ’ చ వైశన్తాయ’ చ
నదీగత జలరూపుడైనట్టివానికి, అల్ప సరస్సులైన వేశంతములందు (కోనేరు) జలరూపమున ఉన్నవానికి నమస్కారము.
నమః కూప్యా’య చావట్యా’య చ
బావులలోని జలరూపమున, గర్తములలోని (గోతులలోని) జలరూపమున ఉన్నవానికి నమస్కారము.
నమో వర్ష్యా’య చావర్ష్యాయ’ చ
వర్షజలరూపమున ఉన్నవానికి, వర్షేతరములైన సముద్రాది జలముల రూపమున ఉన్నవానికి నమస్కారము.
నమో’ మేఘ్యా’య చ విద్యుత్యా’య చ
మేఘమునందున్నట్టివానికి, మెఱుపు రూపములోనున్నవానికి నమస్కారము.
నమ ఈధ్రియా’య చాతప్యా’య చ
నిర్మలముగా ప్రకాసించు శరత్కాల మేఘమునందు (నిర్జలమైన మేఘము!), సూర్యుడు ప్రకాసించుచుండగా వర్షించుచున్న మేఘమునందు ఉన్నవానికి నమస్కారము.
నమో వాత్యా’య చ రేష్మి’యాయ చ
పెనుగాలులతోకూడిన వర్షమునందును, ప్రళయకాలమున సంభవించు కుంభవృష్టియందును ఉన్నవానికి నమస్కారము.
నమో’ వాస్తవ్యా’య చ వాస్తుపాయ’ చ
సకల చరాచర వస్తువులయందునూ, గృహనిర్మాణమునకు అవసరమైన భూమిలో వాస్తుపురుషుని రూపమునందునూ ఉన్నవానికి నమస్కారము.
No comments:
Post a Comment