శ్రీ రుద్రం 9వ అనువాకం
నమ’ ఇరిణ్యా’య చ ప్రపథ్యా’య చ
చవిటినేలయందు ఉన్నవానికి, పదిమంది నడుచునట్టి త్రోవలో ఉన్నవానికి నమస్కారము.
నమః’ కిగ్ంశిలాయ’ చ క్షయ’ణాయ చ
రాళ్ళతో నిండిన (నివాసయోగ్యముకాని) ప్రదేశములందున్నవానికి, నివాసయోగ్యమైన ప్రదేశములందున్నవానికి నమస్కారము.
నమః’ కపర్దినే’ చ పులస్తయే’ చ
జటాజూటము కలిగియున్నవానికి, తన భక్తుల ఎదుట ఎల్లప్పుడూ ఉండునట్టివానికి నమస్కారము.
నమో గోష్ఠ్యా’య చ గృహ్యా’య చ
గోశాలలలోనుండునట్టివానికి, సామాన్య గృహములందు ఉండునట్టివానికి నమస్కారము.
నమస్-తల్ప్యా’య చ గేహ్యా’య చ
సామాన్యులవలే తల్పము (మంచము)నందు శయనించువానికి, ధనవంతులవలే మహాప్రాసాదములందు ఉండువానికి నమస్కారము.
నమః’ కాట్యా’య చ గహ్వరేష్ఠాయ’ చ
ముండ్లతోనిండి ప్రవేశింపనలవికాని ప్రదేశములందు ఉండువానికి, పర్వత గుహలయందుండువానికి నమస్కారము.
నమో” హృదయ్యా’య చ నివేష్ప్యా’య చ
అగాధ జలములందుండువానికి, నీహార (మంచు) జలములందుండువానికి నమస్కారము.
నమః’ పాగ్‍మ్ సవ్యా’య చ రజస్యా’య చ
పరమాణువులయందు ఉన్నవానికి, ధూళి కణములలో సైతము ఉన్నవానికి నమస్కారము.
నమః శుష్క్యా’య చ హరిత్యా’య చ
ఎండిపోయి ఉన్నవాటియందు (కఱ్ఱలు మొదలైనవి) ఉన్నవానికి, పచ్చనివాటియందు ఉన్నవానికి నమస్కారము.
నమో లోప్యా’య చోలప్యా’య చ
తృణాదికములు లేని కఠిన నేలలయందును, రెల్లుగడ్డి మొదలగు తృణములందును ఉన్నవానికి నమస్కారము.
నమ’ ఊర్మ్యా’య చ సూర్మ్యా’య చ
భూమియందునూ, చక్కని కెరటములుగల నదులయందునూ ఉన్నవానికి నమస్కారము.
నమః’ పర్ణ్యాయ చ పర్ణశద్యా’య చ
నవనవలాడుచున్న పచ్చని ఆకులయందున్నవానికి, ఎండుటాకుల కుప్పలయందున్నవానికి నమస్కారము.
నమో’உపగురమా’ణాయ చాభిఘ్నతే చ
ప్రయోగించుటకు సిద్ధముగానున్న ఆయుధములను ధరించియున్నవానికి, సంపూర్ణముగా సంహరించునట్టివానికి నమస్కారము.
నమ’ ఆఖ్ఖిదతే చ ప్రఖ్ఖిదతే చ
కొద్దిపాటి దుఃఖమును కల్గించువానికి, మిక్కుటమగు దుఃఖమును కల్గించువానికి నమస్కారము.
నమో’ వః కిరికేభ్యో’ దేవానాగ్ం హృద’యేభ్యో
భక్తులకు సర్వ సంపదలను ప్రసాదించువానికి, సర్వ దేవతల హృదయమైనవానికి నమస్కారము.
నమో’ విక్షీణకేభ్యో
"క్షీణించుట" అను గుణము లేనివానికి నమస్కారము.
నమో’ విచిన్వత్-కేభ్యో
వివేచనచేసి భక్తులు ఆపేక్షించువాటిని యొసంగువానికి నమస్కారము.
నమ’ ఆనిర్ హతేభ్యో
సంపూర్ణముగా, నిశ్శేషముగా జీవుల పాపములను నశింపజేయువానికి నమస్కారము.
నమ’ ఆమీవత్-కేభ్యః’
స్థూలంగా అనేకమైన భౌతిక రూపాలలో వ్యక్తమవుతున్నవానికి నమస్కారము.
No comments:
Post a Comment