శ్రీ రుద్రం 8వ అనువాకం
నమః సోమా’య చ రుద్రాయ’ చ
ఉమతో గూడియున్నట్టివానికి, సకల జీవుల దుఃఖములను నశింపజేయువానికి నమస్కారము.
నమ’స్తామ్రాయ’ చారుణాయ’ చ
తామ్రవర్ణమున నుండువానికి, ఆపై అరుణవర్ణమున నుండువానికి నమస్కారము.
నమః’ శఙ్గాయ’ చ పశుపత’యే చ
జీవులకు సుఖములను చేకూర్చువానికి, భయహేతువులైన పాప రోగ చోరాదులనుండి రక్షించువానికి నమస్కారము.
నమ’ ఉగ్రాయ’ చ భీమాయ’ చ
ఉగ్రరూపమున నుండువానికి, చూచిన మాత్రముననే భయమును కల్గించువానికి నమస్కారము.
నమో’ అగ్రేవధాయ’ చ దూరేవధాయ’ చ
ఎదురుగానుండి జరుపు వధకు, దూరమునుండే జరుపు వధకును నమస్కారము.
నమో’ హన్త్రే చ హనీ’యసే చ
సంహరించువానికి, సర్వులనూ సంహరించువానికి నమస్కారము.
నమో’ వృక్షేభ్యో హరి’కేశేభ్యో
పచ్చని ఆకులను కేశములుగా కలిగియున్న వృక్షముల రూపమున నున్నవానికి నమస్కారము.
నమ’స్తారాయ
తరింపజేయువానికి నమస్కారము.
నమ’శ్శమ్భవే’ చ మయోభవే’ చ
ఈ లోకమునందు ఆనందమునకు కారణమైనవానికి, పరలోకములందు ఆనందమునకు కారణమైనవానికి నమస్కారము.
నమః’ శంకరాయ’ చ మయస్కరాయ’ చ
విషయ సుఖమును చేకూర్చువానికి, మోక్ష సుఖమును చేకూర్చువానికి నమస్కారము.
నమః’ శివాయ’ చ శివత’రాయ చ
కళ్యాణ స్వరూపుడైనట్టివానికి, మిగిలిన అన్నింటికంటే అత్యంత కళ్యాణ స్వరూపుడైనట్టివానికి నమస్కారము.
నమస్తీర్థ్యా’య చ కూల్యా’య చ
తీర్థములందు నెలకొనియున్నవానికి, నదీతీరములయందు నెలకొనియున్నవానికి నమస్కారము.
నమః’ పార్యా’య చావార్యా’య చ
ఆవలి ఒడ్డున ఉన్నవానికి, ఇవతలి ఒడ్డున ఉన్నవానికి నమస్కారము.
నమః’ ప్రతర’ణాయ చోత్తర’ణాయ చ
పాపములను నశింపజేసుకొనుటకు హేతువైనట్టివానికి, ముక్తిని పొందుటకు హేతువైనట్టివానికి నమస్కారము.
నమ’ ఆతార్యా’య చాలాద్యా’య చ
మరలా మరలా జన్మించుచున్నవానికి, జీవుల రూపములో కర్మ ఫలములను అనుభవించుచున్నవానికి నమస్కారము.
నమః శష్ప్యా’య చ ఫేన్యా’య చ
నదీతీరమునందలి దర్భలు మొదలగు బాలతృణములందున్నవానికి, నదీజలముల రాపిడిచే ఏర్పడు నురుగనందున్నవానికి నమస్కారము.
నమః’ సికత్యా’య చ ప్రవాహ్యా’య చ
ఇసుకనందున్నవానికి, నీటి ప్రవాహమునందున్నవానికి నమస్కారము.
No comments:
Post a Comment